Wednesday, June 10, 2026

గమ్యం లేని బాధ

 అంతు లేని అభిమానం ప్రేమయితే,

చేరలేని గమ్యమే కోరికైతే ,
కన్నీటి ప్రవాహమే ప్రయాణమవుతుంది ..
క్షణ క్షణం మోయలేని భారమైనా..
గమ్యం ఎరుగని బాధ శ్వాసలా మారి..
నీ జ్ఞాపకాల ఉనికికై పోరాడుతోంది..
నిస్వార్థమైన ప్రేమ నీ ఆనందమే కోరింది ..
కన్నీరు నిండిన చిరునవ్వుని .. 
కపటం ఎరుగని మనసు .. ఆనంద భాష్పాలుగా భ్రమ పడుతోందా ..
లేక ఇంకెంత ప్రేమ అందించ గలనో అని ఆరాటపడుతోందా ..

No comments:

Post a Comment