Wednesday, May 23, 2018

ఒరేయ్ మనిషీ .. చచ్చిపో ..
------------------------
నిగ్గదీయి సమాజాన్ని .. సిగ్గులేని శిలాజాన్ని..
నీతి దానికి పడదు .. నిస్వార్ధాన్ని నిలవనీయదు ..
దానికి కావలసింది స్వలాభం .. అసలే పట్టదు వసుదైక కుటుంబ భావం ..
నీతిలేని మొఖాలు.. జాతి గూర్చి బీరాలు ..
నేతి బీర చందాలు .. వీరిచ్చే అభయాలు ..
నా కులమంటాడు .. నా మతమంటాడు ..
అసలు నువ్వు మనిషివే కానపుడు .. ఎందుకా కుల మత తోకలు ..
తోకలున్న జంతువులు కూడ .. మానవత్వం చాటుతుంటే ..
మన తత్వాన్ని ,మనకి తిరిగి బోధిస్తుంటే..
నేటి మనిషి , తన తత్వమైన మానవత్వాన్ని వీడి ..
మృగతత్వాన్ని ఆచరిస్తూ .. ముక్కుతూ మూలుగుతున్నాడు ..
ఖ్యాతి గడింపలేని మూర్ఖులు ,నేర్పు గ్రహించలేని మూఢులు ..
తోడ్పాటు నివ్వలేని మానవ వ్యర్ధాలు వీరు .. మన సమాజాన్ని అసలెలా ఉధ్ధరించగలరు ..
మనమే కదలాలి .. ఈ పరిస్థితి మార్చాలి ..
భావ దారిద్ర్యాన్ని వీడి .. బావి తరానికి పునాదులు నాటాలి ..
రండి కదులుదాం .. దిశానిర్దేశం చేద్దాం ..
లేదా ఇలాగే నిస్తేజం గా ఉండి పోదాం ..
ఎలా ఉన్నా మేమే గొప్ప అని పొగుడుకుంటూ ..
ఆ శిలాజాల భావజాలాన్ని శిరసుపై మోసుకుంటూ , మన చితి మనమే పేర్చుకుంటూ .. 

No comments:

Post a Comment