నేటి మన సమాజంలో , మనుషుల మధ్య ఇన్ని సాంకేతికంగా మెరుగైన అనుసంధాన సాధనాలు ఉన్నప్పటికీ , మనసుల మధ్య చాలా దూరం పెరిగిపోతోంది , కారణం , మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో గ్రహించలేకపోవడం ..
ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే , మన కోణంలోనే ఆలోచిస్తూ , ఎదుటివారు కూడా మన ఆలోచనలకు అణుగుణంగానే ఉండాలని అపోహపడటం చాలా సందర్భాలలో మన అసహనానికి కారణం అవుతుంది మనకు తెలియకుండానే ..
ఇలా ఆలోచించడానికి చాల కారణాలున్నాయి , అందులో మొట్టమొదటిది , మనమే గొప్ప అనే భావన .. మిగిలిన కారణాలు విశ్లేషిస్తే , మన మాటే నెగ్గాలనే వాంఛ , స్వార్థం అని ఇట్టే అర్థమైపోతుంది
ఎటొచ్చీ , ఇది మనకు మనం తెలుసుకోడానికి కొంత సమయం ఈ విషయం గురించి ఆలోచించడానికి కేటాయిస్తే మనకే సమాధానం దొరుకుతుంది కానీ మనకి ఇలాంటి అవసరమయిన చిన్న విషయాల మీద ఆలోచించే అవసరం విలువ తెలియకపోవడం ఒక బాధాకరమయిన వాస్తవం ..
No comments:
Post a Comment